Abn logo
Sep 22 2021 @ 22:26PM

రైతు భరోసా కేంద్రాలతో పశువైద్య సేవలు

మాట్లాడుతున్న సోమయ్య

కలువాయి, సెప్టెంబరు 22 : రైతు భరోసా కేంద్రాల ద్వారా  పశువైద్య సేవలు అందిస్తున్నట్లు పశుసంవర్ధ శాఖ సంయుక్త సంచాలకులు డా. బి. మహేశ్వరుడు తెలిపారు. స్థానిక ప్రాంతీయ పశువైద్యశాలలో బుధవారం కలువాయి, చేజర్ల  మండల సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. 75శాతం రాయితీపై పశుగ్రాస విత్తనాలు కూడా అందజేస్తున్నట్లు తెలియజేశారు. వైయస్‌ఆర్‌ చేయూత, జగనన్న పాల వెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల అమలుపై సమీక్షించారు. ఉప సంచాలకులు బీవీ.సురేష్‌, టి.సోమయ్య, సహాయ సంచాలకులు సురేష్‌ నాయుడు, వైద్యులు గంగాధర్‌, రాజేష్‌, కృష్ణమోహన్‌, పశువైద్య సహాయకులు లక్ష్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.