Advertisement
Advertisement
Abn logo
Advertisement

Pujara లాంటి ఆటగాడిని చూడలేదు: ప్యాట్ కమిన్స్

మిస్టర్ డిపెండబుల్, టీమిండియా నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారాపై ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్ పాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. పుజార పటిష్టమైన రాతి గోడ అని, ప్రస్తుత తరంలో నిజమైన క్లాస్‌ ఆటగాడని అన్నాడు. క్రీజులో అతడి సహనానికి ఎంతటి బౌలర్‌ అయినా దండం పెట్టాల్సిందేనని,  బుల్లెట్‌ వేగంతో దూసుకొచ్చే బంతులను సైతం అతను సునాయాసంగా అడ్డుకుంటాడని ప్రశంసించాడు. 


`గబ్బా టెస్ట్‌లో పుజార ఆత్మవిశ్వాసాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఓ ఎండ్‌లో పుజారాను, మరో ఎండ్‌లో పంత్‌ను చూడటం విచిత్రంగా అనిపించింది. భీకరమైన బంతులు శరీరాన్ని గాయపరిచినా పుజారా చలించలేదు. నొప్పిని భరిస్తూనే ఆటను కొనసాగించాడు. అతనిలా జట్టు ప్రయోజనాల కోసం దెబ్బలు తగిలించుకున్న ఆటగాడిని ఎప్పుడూ చూడలేదు. అతడి డిఫెన్స్ అద్భుతమ`ని అన్నాడు. 

Advertisement
Advertisement