Abn logo
Sep 25 2021 @ 01:05AM

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ఆసుపత్రిలో రిజిష్టర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

- కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ 

- కాల్వశ్రీరాంపూర్‌ ప్రభుత్వాసుపత్రి, తహసీల్దార్‌ కార్యాలయాల తనిఖీ

కాల్వశ్రీరాంపూర్‌ సెప్టెంబర్‌ 24: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం కాల్వశ్రీరాంపూర్‌ 30 పడకల ఆసుపత్రిని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. ఈ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందుతుందని రో గులను అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్‌ ఉన్న వారికి ప్రభుత్వమే ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని, సంబంధిత ఆశా వర్కర్‌ రోగుల ఇంటి వద్దకే వచ్చి మందులు అందజేస్తుందని ఆసుపత్రికి వచ్చినవారికి కలెక్టర్‌ తెలియజేశారు. ఆస్పత్రిలోని బెడ్లు, మరుగుదొడ్లను పరిశీలించి నీటి సౌకర్యం సరిగా ఉందా అని డాక్టర్‌ ప్రవీణ్‌ని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ కిట్టు, ఆస్పత్రిలో ఓపీ సేవలు, 104 రిజిస్టర్లు పరిశీలించారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు, కరోనా టెస్టులు సరిగా జరుగుతున్నాయా అని డాక్టర్‌ను అడిగారు. ఆసుపత్రితో పాటు అన్ని గ్రా మాల్లో ఏఎన్‌ఎంలు, ఆశాలు కరోనా వ్యాక్సిన్‌లు వేస్తున్నట్లు డాక్టర్‌ వివరించారు. ఈ ఆస్పత్రిలో 108 వాహనం లేకపోవడం వలన ప్రజ లు ఇబ్బందులకు గురవుతున్నారని, వాహనాన్ని స్థానికంగా ఉండేట్లు ఏర్పాటు చేయాలని, అలాగే ఆసుపత్రిలో ఉన్న సమస్యలను కలెక్టర్‌కు ఎంపీపీ నూనె టీ సంపత్‌, జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డిలు వివరించారు. ఆసుపత్రి వెనుక పరిశీలించిన కలెక్టర్‌ పిచ్చిమొక్కలతో ఉన్న ఆ స్థలం శుభ్రం చేయించాలని మొక్కలు తొలగించాలని ఎంపీడీవో రామ్మోహన్‌చారి ఆదేశించారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామాల్లో సబ్‌సెంటర్లు మంజూరయ్యాయని త్వరగా ప్రారంభించి పనులు చేపడుతామన్నారు. అనంతరం మంగపేట ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు కరోనా రాకుం డా కొవిడ్‌ నిబంధనలతో బోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూ చించారు. కాల్వశ్రీరాంపూర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం కూడా తనిఖీచేసి భూముల రికార్డులను పరిశీలించారు. భూమి పట్టాల గురించి తహసీల్దార్‌ సునీతను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం వ్యవసాయశాఖ అధి కారులతో సమావేశం నిర్వహించారు. రైతుబందు, రైతు బీమా మండలంలో ఎంత మంది రైతులకు వచ్చిందని ఏవో నాగార్జునను అడిగి తెలుసుకున్నారు. పంటల నమోదు ఎంతశాతం చేశారని వ్యవసాయ అధికారులను అడిగారు. పంటల విషయంలో రైతులకు ఎప్పటికప్పు డు తగు సూచనలు చెయ్యాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదే శించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి తిరుమలప్ర సాద్‌, ఎంపీడీవో రామ్మోహన్‌చారి ఇతర అధికారులు పాల్గొన్నారు.