పాటిమ్మ తల్లి జాతర ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-14T05:18:56+05:30 IST

‘ప్రజలందరూ సుఖ సంతోషాలు, పాడి పంటలతో మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలి తల్లీ’ అని చల్లచింతలపూడి గ్రామ దేవత శ్రీపాటిమ్మ తల్లిని భక్తులు వేడుకున్నారు.

పాటిమ్మ తల్లి జాతర ప్రారంభం

దెందులూరు, ఏప్రిల్‌ 13 : ‘ప్రజలందరూ సుఖ సంతోషాలు, పాడి పంటలతో మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలి తల్లీ’ అని చల్లచింతలపూడి గ్రామ దేవత శ్రీపాటిమ్మ తల్లిని భక్తులు వేడుకున్నారు. గ్రామ శివారులో ఉన్న అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలను ఆలయ ధర్మకర్త పర్వతనేని ప్రభాకర్‌ దంపతులు నిర్వహించారు. పెరుగుగూడెం యలమర్తివారి ఆడపడుచు గ్రామ దేవత పాటిమ్మతల్లి జాతరకు నూతన వస్త్రలు పుట్టింటి పసుపు, కుంకుమలను అందించి ఉత్సవాలు ప్రారంభించారు. తొలి పూజను పెరుగుగూడెం సర్పంచ్‌ యలమర్తి రామకృష్ణరేవతి, మాజీ సర్పంచ్‌ యల మర్తి హేమశ్రీనివాస్‌ దంపతులు, ప్రభాకర్‌ దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-04-14T05:18:56+05:30 IST