కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మొత్తానికో గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-07-14T01:42:29+05:30 IST

పాట్నా ఎయిమ్స్ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇవాల్టి నుంచి..

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మొత్తానికో గుడ్‌న్యూస్

పాట్నా: పాట్నా ఎయిమ్స్ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇవాల్టి నుంచి కరోనా వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభించినట్లు తెలిపింది. హాస్పిటల్ అథారిటీ ఎంపిక చేసిన 18 మంది వలంటీర్లపై ట్రయల్స్ మొదలుపెట్టినట్లు వెల్లడించింది. అయితే.. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో భాగమయ్యేందుకు ఎయిమ్స్ హాస్పిటల్‌ అథారిటీని పలువురు సంప్రదించినప్పటికీ, 18 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ 18 మంది కూడా 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులని పాట్నా ఎయిమ్స్ పేర్కొంది. తొలుత.. ఈ 18 మందికి మెడికల్ చెకప్ చేసి, వారి రిపోర్ట్‌లను పరిశీలించాక ట్రయల్స్ మొదలుపెట్టనున్నట్లు స్పష్టం చేసింది.


ఐసీఎమ్‌ఆర్ మార్గదర్శకాల ప్రకారం, వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌ను రిపోర్ట్‌ పరిశీలించాక మాత్రమే ఇవ్వాలని.. అందుకే సోమవారం వీరందరికీ మెడికల్ చెకప్ నిర్వహించినట్లు తెలిపింది. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎమ్‌ఆర్ ఎంపిక చేసిన 12 ఇన్‌స్టిట్యూట్స్‌లో పాట్నా ఎయిమ్స్ ఒకటి కావడం గమనార్హం.

Updated Date - 2020-07-14T01:42:29+05:30 IST