Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేటి గాంధారి విజయలక్ష్మి: పట్టాభి

తిరుపతి: నేటి గాంధారి వైఎస్ విజయలక్ష్మి అని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వైఎస్ వివేకానందారెడ్డి  హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని జగన్ సీఎం అయ్యాక  కేసును వెనక్కు తీసుకోవటం విజయలక్ష్మికు కన్పించలేదా అని ప్రశ్నించారు. కళ్లకు కట్టిన గంతలు తీసేసి సునితమ్మ పిటిషన్‌లో పేర్కొన్నట్లు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నపుడు తీసుకున్న అంశాలు ఆమె చూడలేదా? అని నిలదీశారు.  దోషులను కాపాడాలని జగన్ సిట్‌ను పదే పదే మార్చాలని చూడటాన్ని కూడా సునితమ్మ రాశారు. ఆ విషయాన్ని విజయలక్ష్మి చూడలేదా? అని పట్టాభి ప్రశ్నించారు.  ఈ విషయంపై  ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


 వైఎస్ వివేకానందారెడ్డి  హత్య కేసులో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను నిందితులని చార్జ్‌షీట్‌లో సునితమ్మ రాసింది విజయలక్ష్మికు కన్పించలేదా ?  అని పట్టాభి ప్రశ్నించారు.  వారిద్దరికీ ఢిల్లీలో ఎందుకు కీలక పదవులు కట్టబెడుతున్నారో  చెప్పాలన్నారు. తనకు జగన్ పాలనలో రక్షణ లేదని సునితమ్మ రాసింది విజయలక్ష్మికు కన్పించ లేదా అని పట్టాభి ప్రశ్నించారు. మా అందరి మద్దతు ఉందని చెప్పే విజయలక్ష్మి ఒక్క రోజైన సాక్షి పేపర్‌లో, టీవీలో సునితమ్మ గళాన్ని విన్పించారా అని నిలదీశారు. సునితమ్మకు మంచి న్యాయవాదిని ఎందుకు  ఏర్పాటు చేయలేదు? అని నిలదీశారు. కోడికత్తి కేసులో డ్రామాలు ఆడిన తెలంగాణలోని ఇద్దరు రెడ్డి వైద్యులకు ఏపీలో కీలక పదవులు ఎందుకు ఇచ్చారు? అని పట్టాభి  ప్రశ్నించారు. సొంత చెల్లెళ్లకే జగన్ వెన్నుపోటు పొడిచాడు’’ అని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement