పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2021-01-21T06:47:28+05:30 IST

పట్టణంలో నవరత్నాల పఽథకంలో భాగంగా చేపట్టాల్సిన పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం రెండోసారి వాయిదా పడింది.

పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

నిరాశగా వెనుదిరిగిన లబ్ధిదారులు 

పేదల విషయంలో రాజకీయం తగదు 

- ఎమ్మెల్యే పయ్యావుల


ఉరవకొండ, జనవరి20: పట్టణంలో నవరత్నాల పఽథకంలో భాగంగా చేపట్టాల్సిన పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం రెండోసారి వాయిదా పడింది. గత నెల 25న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్లపట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మండల వ్యాప్తంగా పట్టాల పంపిణీ పూర్తి చేశారు. ఉరవకొండలో ఈనెల 7వ తేదీన చేపట్టాల్సి ఉం డగా ఉన్నట్టుండి వాయిదా పడింది. రాష్ట్ర ప్ర భుత్వం ఈనెల 20వ తేదీ వరకూ గడువు పొడిగించడంతో ఆ లోపు పట్టాల పంపిణీ చేపడుతామని అధికారులు ప్రకటించారు. అలాగే బుధవారం పట్టణ శివారులోని  గురుకుల పా ఠశాల వద్ద 511 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టా లు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్దమై ఏర్పాట్లు కూడా పూర్తి చేశా రు. వలంటీర్ల సూచన మేరకు లబ్ధిదారులు పట్టాల పంపిణీ ప్రదేశానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అధికారులు కూడా పట్టాలు పంపిణీ చే సేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ ఉన్నఫలంగా పంపిణీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే పం పిణీ చేసే తేదీలను ప్రకటిస్తామన్నారు. దీంతో లబ్ధిదారులు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. వందల రూ పాయలు బాడుగ చెల్లించి, పనులు మానుకుని ఇక్కడికి వచ్చిన తరువాత వాయి దా వేయడమేమిటని వాపోయారు. పట్టాల పంపిణీ నేపథ్యంలో భారీగా స్పెషల్‌ పార్టీ పోలీసులను రప్పించారు. దీనిపై తహసీల్దారు మునివేలు మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకే పట్టాల పంపిణీని వాయిదా వేశామన్నారు. 


పేదల పట్టాలపై రాజకీయం చేయొద్దు

- ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

పేదలకు పట్టాలు పంపిణీ చేయకుండా రాజకీయం చే యడం తగదని ఎమ్మెల్యే ప య్యావుల కేశవ్‌ పేర్కొన్నా రు. స్వార్థ ప్ర యోజనాల కో సం వాయిదా వేశారని అ న్నారు. మొదట ఈనెల 7వ తేదీన జరగాల్సిన పట్టాల పంపిణీ వాయిదా వేశారన్నారు. పేదప్రజలు పనులన్నీ మానుకొని బుధవారం వస్తే మరలా వా యిదా వేయడమేమిటని ప్ర శ్నించారు. ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన 3,086 పట్టాలకు హద్దులు చూపించాలన్నారు. ఆ బాధ్యత అధికారులపై ఉందన్నారు. 


వాయిదా వేయడం సరికాదు

- మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గీయులు

పట్టాల పంపిణీ వాయిదా వేయడం సరికాదని మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ రమణాయాదవ్‌, విశ్రాంతి ఉద్యోగి రామాంజనమ్మ పేర్కొన్నారు. పట్టాల పంపిణీ వాయిదా వేయడంపై మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి వర్గీయులు స్థా నిక రోడ్లు, భవనాలు వసతి గృహం నుంచి వై ఎస్సార్‌ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. పట్టాల పంపిణీ నిర్వహించాలని డిమాండ్‌ చే శారు. రాష్ట్రం మొత్తం పట్టాల పంపిణీ జరుగుతుంటే ఉరవకొండలో మాత్రం వాయిదా వే యడమేమిటని ప్రశ్నించారు. పట్టాల పంపిణీ స్థలానికి ఉదయాన్నే లబ్ధిదారులు చేరుకున్నారని వాయిదా వేయడం వల్ల పేదలు వెనుతిరగాల్సి వచ్చిందన్నారు. పట్టాల పంపిణీ వెంటనే చేపట్టాలన్నారు. లేని పక్షంలో మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తిప్పారెడ్డి, రామాంజనేయులు, ధనుంజయ, బసవరాజు, జిలాన్‌, ఎర్రిస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:47:28+05:30 IST