పుట్టపర్తిలో పవన్‌ విమానం ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2021-10-02T19:34:33+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు అడుగడునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు అవాంతరాలు సృష్టించగా తాజాగా పుట్టపర్తిలో

పుట్టపర్తిలో పవన్‌ విమానం ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ

అనంతపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు అడుగడునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు అవాంతరాలు సృష్టించగా తాజాగా పుట్టపర్తిలో పవన్‌ విమానం ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజమహేంద్రి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బెంగళూరుకు పవన్‌ బయలుదేరనున్నారు. బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కొత్తచెరువుకు రానున్నారు. కొత్త చెరువులో దెబ్బతిన్న రోడ్లకు పవన్ శ్రమదానం చేయనున్నారు. 


Updated Date - 2021-10-02T19:34:33+05:30 IST