YSRCPలో మూడు ముక్కలాట.. MLA Ticket కోసం ఇప్పట్నుంచే ఆయన ప్రయత్నాలు..!

ABN , First Publish Date - 2021-12-22T12:35:23+05:30 IST

YSRCPలో మూడు ముక్కలాట.. MLA Ticket కోసం ఇప్పట్నుంచే ఆయన ప్రయత్నాలు..!

YSRCPలో మూడు ముక్కలాట.. MLA Ticket కోసం ఇప్పట్నుంచే ఆయన ప్రయత్నాలు..!

  • రంగంలోకి మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి


చిత్తూరు జిల్లా/మదనపల్లె : మదనపల్లె వైసీపీలో మూడు ముక్కలాట మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల పూర్తికాగానే, పార్టీలో అలకలు, ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఎమ్మెల్యే ఎం.నవాజ్‌బాషా ఒక్కరే అన్నీతానై వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా మున్సిపల్‌, మండల స్థాయిలో నాయకులు, ప్రజాప్రతినిధులకు అటు పార్టీ, ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లారు. ఇదిలావుండగా, పార్టీ అధి నేత, సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి జన్మదినాన్ని మంగళవారం మదన పల్లెలో మూడువర్గాలు వేర్వేరుగా చేపట్టాయి. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎప్పటిలాగే  జడ్పీ ఉన్నత పాఠశాలలో కేక్‌ కటింగ్‌తోపాటు రక్తదాన శిబిరం నిర్వహించారు.


నియోజకవర్గస్థాయిలో మున్సిపాలిటీ, మండలాలతో కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి, ఆయన అనుచరవర్గం పార్టీ కార్యాల యంలో కేక్‌ కటింగ్‌ చేశారు. వీరిద్దరూ ఓ ఎత్తయితే, తాజాగా మూడో వ్యక్తి... మల్లెల ఫౌండేషన్‌ వ్యవ స్థాపకుడు మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి సీఎం జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. జిల్లాలో ఎవరూ, ఎన్నడూ చేయనంత ఘనంగా హెలికాప్టర్‌లో జగన్‌ కటౌట్‌పై పూలు చల్లాలని ప్లాన్‌చేసి విఫలమయ్యారు. పవన్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్‌లో మూడు రౌండ్లు వేసి, తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు. ప్రత్యర్థి వర్గం అడ్డువడడం వల్లే హెలికాప్టర్‌కి అను మతి లభించలేదని ఆయన అనుచరులు చెప్పుకున్నారు.


చివరికి బీటీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కేక్‌ కటింగ్‌ కార్యక్రమాన్ని ఆయన అనుచరులు పూర్తి చేశారు. పార్టీలో స్థానిక ప్రజాప్రతినిధికి వ్యతిరేకవర్గం పవన్‌కుమార్‌రెడ్డి వెంట నడిచింది. ఇదిలావుండగా, 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి మదనపల్లె నియోజకరవ్గంపై కన్నేసిన రామ సముద్రం మండలం చెంబకూరుకు చెందిన పవన్‌ కుమార్‌రెడ్డి... కొంతకాలంగా పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అటు సీఎం జగన్‌కు, ఇటు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి దగ్గరవుతున్నట్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాకపోగా, 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అటు మంత్రికి, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.

Updated Date - 2021-12-22T12:35:23+05:30 IST