Sep 26 2021 @ 00:56AM

Pawan kalyan: పరిశ్రమ వైపు కన్నెత్తి చూడొద్దు.. కాలిపోతారు.

సినీ పరిశ్రమపై కన్నెత్తి  చూస్తే ఊరుకునేది లేదని పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన  ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ఆయనన  ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. అక్టోబర్‌ 1న విడుదల ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘సాయితేజ్‌ ఇంకా కోమాలో ఉన్నాడు. ఇంకా కళ్లు తెరవలేదు. తను ఆసుపత్రిలో ఉన్నందువల్లే తేజ్‌కి, నిర్మాతలకు విషెస్‌ చెప్పడానికి వచ్చాను. తేజ్‌ హై స్పీడ్‌తో వస్తున్నాడని అందుకే యాక్సిడెంట్‌ అయిందని తప్పుగా కథనాలు అల్లారు. ప్రమాదాలు అందరికీ జరుగుతాయి. మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. సినిమాల వాళ్లు కూడా మనుషులే! మా మీద కొంచెం కనికరం చూపించండి. ఇలాంటి సమయంలో మాట్లాడాల్సింది తేజ్‌కి జరిగిన ప్రమాదం గురించి కాదు. వైఎస్‌. వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు? కోడి కత్తితో ఒక నాయకుడిని పొడవడం వెనకున్న కుట్ర ఉంది. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం ఇలాంటి వాటి మీద కథనాలు ఇవ్వండి. మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింసపై మాట్లాడాలి. వైసీపీ నాయకులూ చిత్ర పరిశ్రమను వైపు కన్నెత్తి చూడొద్దు.. కాలిపోతారు. ఇది వైసీపీ రిపబ్లిక్‌.. కాదు ఇండియన్‌ రిప్లబిక్‌’’ అని అన్నారు. 

గూండాలకు భయపడితే బతకలేం...

సినిమా పరిశ్రమ చాలా సున్నితమైనది. ఇక్కడ కులాలు, మతాలు ఉండవు. పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయి. ఎవరైనా సినిమా పరిశ్రమ జోలికి వేస్త మనమంతా కలవాలి. నేను ఎవరి కులం చూడను.. వ్యక్తిత్వానికే విలువిస్తా. నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా. గూండాలకు భయపడితే మనం బతకలేం. సినిమావాళ్ల కోట్ల రూపాయిలు పారితోషికం తీసుకుంటున్నారని అర్హత లేని ప్రతి ఒక్కడూ మాట్లాడతాడు. సినిమావాళ్లు సినిమా వాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడంలేదు. అక్రమ ప్రాజెక్ట్‌లతో సంపాదించుకోవడం లేదు. ఒళ్లు హునం చేసుకుని డాన్స్‌లు, ఫైట్లు చేస్తే వరికిఇ రూపాయి  వస్తుంది. ప్రభాస్‌ – రానా కండలు పెంచి, కసరత్తులు చేస్తే ‘బాహుబలి’ వచ్చింది. ఎన్టీఆర్‌ అదిరేటి స్టెప్పులు వేసి, చరణ్‌ గుర్రపు స్వారీలు చేస్తే డబ్బు ఇస్తున్నారు. సినిమా వాళ్లకు ఎవరూ ఊరికే డబ్బు ఇవ్వడం లేదు. తీసుకున్న పారితోషికంలో కొంత పన్ను రూపంలో పోతుంది. మిగిలిన దానితో వారి వ్యవస్థను నడుపుకోవాలి. ఇవేమీ ఆలోచించకుండా నోరు వదిలేస్తారు. అది తప్పు’’ అని అన్నారు. 


సేనాధిపతిలా తిరిగొస్తాడు...

జిమ్‌లో తేజ్‌తో కలిసి వర్కౌట్‌ చేస్తున్నప్పుడు వచ్చిన ఐడియా ఇది. ఆ కథను నాతోనే చేస్తానని మాటివ్వమన్నాడు. సినిమాను నా సైనికుడిలా కాపాడాడు. త్వరలో కోలుకుని సేనాధిపతిలా తిరిగొస్తాడు. నిర్మాతల సపోర్ట్‌ మరువలేనిది. సమకాలీన రాజకీయ, అర్థిక సమస్యలను ప్రతిబింబించేదే సినిమా అని నా నమ్మకం. నేను అలాంటి ప్రయత్నమే చేశా. ఈ సినిమాను థియేటర్‌లో వదిలిపోయే చిత్రంగా కాకుండా, గుండెల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లే సినిమా అవుతుంది’’ అని దేవకట్టా అన్నారు.