జగన్ మాటకి ఆచరణకు పొంతనే లేదు: పవన్‌

ABN , First Publish Date - 2021-07-19T22:00:53+05:30 IST

ఎన్నికల సమయంలో సీఎం జగన్ రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఆయన మాట నమ్మి 30 లక్షల మంది వైసీపీని గెలిపించారని

జగన్ మాటకి ఆచరణకు పొంతనే లేదు: పవన్‌

హైదరాబాద్: ఎన్నికల సమయంలో సీఎం జగన్ రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఆయన మాట నమ్మి 30 లక్షల మంది వైసీపీని గెలిపించారని జనసేనాని పవన్‌‌కల్యాణ్‌ చెప్పారు. ఇప్పుడు 10 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని తప్పుబట్టారు. సీఎం‌ చెప్పిన మాటకి ఆచరణకు పొంతనే లేదని దుయ్యబట్టారు. మోసపోయాం, వంచనకు గురయ్యామనే ఆవేదన యువతలో ఉందని తెలిపారు. లక్షల మంది యువత ఉద్యోగాల కోసం‌ ఎదురు చూస్తున్నారని పవన్ తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనకు జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పవన్ హామీ ఇచ్చారు.

Updated Date - 2021-07-19T22:00:53+05:30 IST