Pawan ఏం నిరూపించాలని అనుకుంటున్నారో: సజ్జల

ABN , First Publish Date - 2021-10-02T20:14:52+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థంకావట్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు

Pawan ఏం నిరూపించాలని అనుకుంటున్నారో: సజ్జల

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థంకావట్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతుంటే వేలమందితో సభ ఎలా? అని ప్రశ్నించారు. కొవిడ్‌ దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసమే ఆంక్షలు విధించామని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమానికి ఎంతమందిని అనుమతించామో చూసే ఉంటారని గుర్తుచేశారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.2200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. నవంబర్‌ నుంచి మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.


Updated Date - 2021-10-02T20:14:52+05:30 IST