పవన్ భీమ్లా నాయక్ మూవీ పాటపై తెలంగాణ పోలీసుల అభ్యంతరం
ABN , First Publish Date - 2021-09-03T02:52:16+05:30 IST
పవన్ భీమ్లా నాయక్ మూవీ పాటపై తెలంగాణ పోలీసుల అభ్యంతరం
హైదరాబాద్: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ పాటపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని కొన్ని పదాలు తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ రమేష్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు. తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టం. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయి.’’ అంటూ రమేష్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు పవన్ కల్యాణ్ అభిమానులు రీట్వీట్ చేస్తున్నారు.