ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్

ABN , First Publish Date - 2021-11-04T23:16:57+05:30 IST

ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరకు రైతుల బాధలను ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్

అమరావతి: ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరకు రైతుల బాధలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? అని ప్రశ్నించారు. రైతు సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చే తీరు సరికాదన్నారు. విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్.సి.ఎస్. చక్కెర కర్మాగారం దగ్గర రైతులు ఆందోళనలు చేస్తున్నారని, ప్రభుత్వం సరిగా స్పందించలేదని తప్పుబట్టారు. రైతులకు రావాల్సిన రూ.16.38 కోట్ల బకాయిలను ఇప్పించాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు.


చక్కెర కర్మాగార యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో రైతులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండు క్రషింగ్‌ సీజనలకు సంబంధించిన రూ.16.33 కోట్ల బకాయిలను ఎన్‌సీఎస్‌ యాజమాన్యం రైతులకు చెల్లించడం లేదు. దీనిపై ఎప్పటికప్పుడు హామీలు ఇవ్వడమే తప్ప కార్యాచరణ కనిపించలేదు. దీంతో విసుగెత్తిన రైతులంతా పోరాటానికి దిగారు. రైతుల ఆందోళనతో పార్వతీపురం, విజయనగరం మధ్య వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల కొలదీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

Updated Date - 2021-11-04T23:16:57+05:30 IST