Abn logo
May 5 2021 @ 03:26AM

వెంటనే పరిహారం చెల్లించండి

సంస్థలో పనిచేస్తూ చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోండి: ఎన్‌ఎంయూ


విజయవాడ (బస్‌స్టేషన్‌), మే 4: ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు, మెడికల్‌ వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న ఉద్యోగులకు వెంటనే పరిహారం సొమ్ము చెల్లించాలని ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌కు మంగళవారం వినతిపత్రం అందజేసినట్టు పేర్కొన్నారు. కరోనా కారణంగా 2020 జనవరి 1 నుంచి 150 మంది చనిపోవడం విచారకరమని అన్నారు. వారితోపాటు మెడికల్‌, వలంటరీ రిటైర్మెంట్‌ ఇతర కారణాలతో సంస్థ నుంచి నిష్క్రమించిన ఉద్యోగులు 180 మందికి ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిగ్రాట్యుటీ, టెర్మినల్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, ఫైనల్‌ సెటిల్మెంట్స్‌ నేటివరకు ఇవ్వలేదని తెలిపారు. దీనివల్ల సంస్థలో అనేక సంవత్సరాలు సర్వీసు చేసిన వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వారికి సత్వరమే డబ్బులు చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకుని ఆయా కుటుంబాలను ఆదుకోవాలని సంస్థ ఎండీని రమణారెడ్డి కోరారు.

Advertisement
Advertisement
Advertisement