Abn logo
Apr 7 2020 @ 06:21AM

పాత బిల్లులే చెల్లించండి

ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ వై.విష్ణు 

విద్యుత్‌ వినియోగదారులకు వెసులుబాటు

 

రింగురోడ్డు, ఏప్రిల్‌ 6 : గతనెల (మార్చి)లో చెల్లించిన విద్యుత్‌ బిల్లులనే ఏప్రిల్‌ నెలకు కూడా చెల్లించాలంటూ ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ వై.విష్ణు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వినియోగదారుల ఇంటికి వెళ్లి విద్యుత్‌ సిబ్బంది బిల్లుల రీడింగ్‌ తీసుకోవడం లేదన్నారు. గతనెల బిల్లునే ఈనెల కూడా చెల్లించాలని సూచించారు. బిల్లులను వినియోగదారుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు. బిల్లువచ్చిన తేదీ నుంచి 15 రోజులలోపు చెల్లించాలన్నారు.


సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ఈనెల బిల్లులో ఉన్న హెచ్చుతగ్గులను తరువాత బిల్లులో సర్దుబాటు చేస్తామన్నారు. వినియోగదారులు తమ బిల్లులను ఏపీఈపీడీసీఎల్‌ యాప్‌ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఇతర పేమెంట్‌ యాప్‌ల ద్వారా చెల్లించవచ్చనని చెప్పారు. వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు తమ సిబ్బంది 24గంటలూ అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. విద్యుత్‌ సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు ఫోన్‌చేసి పరిష్కరించుకోవచ్చన్నారు.  

Advertisement
Advertisement
Advertisement