పూర్తయిన ఐపీఎల్‌ మ్యాచ్‌లకే చెల్లించండి

ABN , First Publish Date - 2021-05-10T09:27:32+05:30 IST

కరోనా కారణంగా ఐపీఎల్‌ వాయిదా పడడంతో అటు స్టార్‌ గ్రూప్‌ కూడా తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా నిలిచింది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లకు మాత్రమే చెల్లింపులు చేయాలని

పూర్తయిన ఐపీఎల్‌ మ్యాచ్‌లకే చెల్లించండి

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఐపీఎల్‌ వాయిదా పడడంతో అటు స్టార్‌ గ్రూప్‌ కూడా తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా నిలిచింది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లకు మాత్రమే చెల్లింపులు చేయాలని కోరింది. 2018-2022 వరకు ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ హక్కులను స్టార్‌ గ్రూప్‌ రూ.16,346 కోట్లకు దక్కించుకుంది. అంటే 60 మ్యాచ్‌లకు గాను ఒక్కో మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు బోర్డుకు చెల్లించనుంది. కరోనా కారణంగా లీగ్‌ వాయిదా పడగా ఇప్పటికి 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉండడంతో స్పాన్సర్లు, ప్రకటనకర్తలు భారీగానే నష్టపోనున్నారు. అందుకే మొత్తంగా కాకుండా పూర్తయిన మ్యాచ్‌లకే డబ్బులు చెల్లించాలని స్టార్‌ గ్రూప్‌ వారికి తెలిపింది. ఈసారి టీవీ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. 2020లో 349 మిలియన్ల మంది వీక్షించగా ఈసారి ఆ సంఖ్య 352 మిలియన్లకు చేరడం విశేషం.

Updated Date - 2021-05-10T09:27:32+05:30 IST