Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెండింగ్‌ బిల్లులు చెల్లించండి

మెనూ మేరకు భోజనం ఇవ్వాలి

ఆందోళనలో టీఎనఎ్‌సఎఫ్‌ నాయకులు


పెనుకొండ, డిసెంబరు 2: హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న సోషల్‌, బీసీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లల్లో పెండింగ్‌ ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని టీఎనఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గురువారం హిందూపురం పార్లమెంట్‌ టీఎనఎ్‌సఎ్‌ఫ అధ్యక్షులు జగదీశ, రాష్ట్ర కార్యదర్శి వినయ్‌బాబు, పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు బండారు భార్గవ్‌, షబీరీ్‌షనాయుడు, అధికార ప్రతినిధి హరీష్‌, అభి ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లల్లో 2020-21ఏప్రిల్‌ నుంచి ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అమలయ్యేలా చూడాలన్నారు. హాస్టల్‌కు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో సంక్షేమ హాస్టల్‌లో పనిచేసే వార్డన్లు సొంత నిధులతో హాస్టళ్లను  నిర్వహిస్తూ అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే  పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తక్షణమే కాస్మొటిక్‌ చార్జీలు విడుదల చేయాలన్నారు. చలి ఎక్కువగా ఉన్న కారణంగా ప్రభుత్వం ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేయాలన్నారు. అంటు వ్యాధి సోకకుండా హాస్టల్‌ పరిసరాలు శుభ్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ నవీనకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటాపురం అభి, ఎండీఎస్‌ అమాన, ఇర్షాద్‌, కార్యదర్శులు బండారు  పెద్దన్న, లక్ష్మీనారాయణ, సాయిప్రసాద్‌, వాసుదేవ, రాప్తాడు అసెంబ్లీ ప్రెసిడెంట్‌ భార్గవ్‌గౌడ్‌, పుట్టపర్తి అసెంబ్లీ ప్రెసిడెంట్‌ శ్రీనివాసులు, మడరశిక ప్రెసిడెంట్‌ రంగస్వామి, పెనుకొండ ప్రెసిడెంట్‌ జయంత, హిందూపురం పట్టణ అధ్యక్షుడు చింటు, మూర్తి, హరీష్‌, హిందూపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు ఈసీ హరీష్‌, తెలుగుయువత నాయకులు హుజురుల్లాఖాన, జావిద్‌, సిద్దయ్య, మణి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement