వోడాఫోన్‌కి ఐటి శాఖ షాక్... కస్టమర్‌కి లక్షల్లో నష్ట పరిహారం

ABN , First Publish Date - 2021-09-11T20:03:39+05:30 IST

వోడాఫోన్ ఐడియాకి రాజస్థాన్ ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఓ కస్టమర్‌కి ఏకంగా 27.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. తగిన విధంగా ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్‌ని వెరిఫికేషన్ చేయకుండానే డూప్లికేట్ సిమ్ జారీ చేయటంతో వోడాఫోన్‌కి ఈ చెల్లింపు తప్పలేదు.

వోడాఫోన్‌కి ఐటి శాఖ షాక్... కస్టమర్‌కి లక్షల్లో నష్ట పరిహారం

జైపూర్ : వోడాఫోన్ ఐడియాకి రాజస్థాన్ ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఓ కస్టమర్‌కి ఏకంగా 27.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. తగిన విధంగా ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్‌ని వెరిఫికేషన్ చేయకుండానే డూప్లికేట్ సిమ్ జారీ చేయటంతో వోడాఫోన్‌కి ఈ చెల్లింపు తప్పలేదు. వివరాల్లోకి వెళితే... 2017, మే 25న కృష్ణ లాల్ నైన్ అనే వ్యక్తి రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ వోడాఫోన్ స్టోర్‌కి వెళ్లి డూప్లికేట్ సిమ్ కోసం అభ్యర్థన చేసుకున్నాడు. కొత్త సిమ్ అయితే వచ్చిందిగానీ అది యాక్టివేట్ కాలేదు. పదేపదే కంప్లైంట్స్ ఇచ్చిన ఆయన చివరకు జైపూర్‌కి వెళ్లి వోడాఫోన్ వారికి కంప్లైంట్ చేయగా మరునాడు సిమ్ యాక్టివేట్ అయింది. కానీ, ఈ లోపు భాను ప్రతాప్ అనే మరో వ్యక్తి కృష్ణ లాల్ నంబర్‌తోనే డూప్లికేట్ సిమ్ సంపాదించి పలు ఓటీపీల ద్వారా 68.5 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నాడు. తన ఐడీబీఐ బ్యాంక్ ఖాతా నుంచీ పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ ఫర్ అయిన సంగతి తెలుసుకున్న బాధితుడు వోడాఫోన్ ఐడియా కంపెనీపై న్యాయ పోరాటానికి దిగాడు. సరైన విధంగా డాక్యుమెంట్స్ ఏవీ వెరిఫికేషన్ చేయకుండానే డూప్లికేట్ సిమ్ ఇచ్చినందుకు నష్ట పరిహారం కోరాడు.  కృష్ణ లాల్ నైన్‌కి మొత్తం 68.5 లక్షల్లో దాదాపు 44 లక్షలు భాను ప్రతాప్ తిరిగి ఇచ్చాడు. మిగిలిన 27.5 లక్షలు వోడాఫోన్ చెల్లించాలని తాజాగా రాజస్థాన్ ఐటీ శాఖ ఆదేశించింది.        

Updated Date - 2021-09-11T20:03:39+05:30 IST