ఐపీఓల్లోకి పింఛను సొమ్ము!

ABN , First Publish Date - 2021-07-21T06:40:37+05:30 IST

త్వరలో పింఛను చందాదారుల సొమ్మును పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ (ఐపీఓ), ఎన్‌ఎ్‌సఈ-200 లిస్టెడ్‌ కంపెనీల షేర్లలోనూ పెట్టుబడిగా పెట్టనున్నారు.

ఐపీఓల్లోకి పింఛను సొమ్ము!

  • ఎన్‌ఎస్ఈ-200 కంపెనీల్లోకీ అనుమతి 
  • పీఎఫ్ఆర్‌డీఏ చైర్మన్‌ బంధోపాధ్యాయ్‌ 


ముంబై: త్వరలో పింఛను చందాదారుల సొమ్మును పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ (ఐపీఓ),  ఎన్‌ఎస్ఈ-200 లిస్టెడ్‌ కంపెనీల షేర్లలోనూ పెట్టుబడిగా పెట్టనున్నారు. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్ల (పీఎ్‌ఫఎం)కు మరో 3-4 రోజుల్లో అనుమతివ్వనున్నట్లు పెన్షన్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) చైర్మన్‌ సుప్రతిమ్‌ బంధోపాధ్యాయ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆప్షన్స్‌ అండ్‌ ఫ్యూచర్స్‌లో ట్రేడవుతూ, రూ.5,000 కోట్లకు పైగా మార్కెట్‌ విలువ కలిగిన షేర్లలో మాత్ర మే పీఎఫ్ఎంలు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంది. ఈ ఆంక్షలు ఫండ్‌ మేనేజర్ల అవకాశాలను పరిమితం చేస్తున్నాయని బంధోపాధ్యాయ అన్నారు. కొత్త పెన్షన్‌ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పీఎ్‌ఫఎంలు ఈక్విటీ పెట్టుబడులపై 11.31 శాతం సంచిత వార్షిక రిటర్నులను అందించగలిగారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్పొరేట్‌ డెట్‌ పథకాల్లో పెట్టుబడులపై 10.21 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలపై 9.69 శాతంగా నమోదైన రిటర్నుల కన్నా అధికమని బంధోపాధ్యాయ అన్నారు.  


ఈ ఏడాదిలో మరో కోటి చందాదారులు.. 

ప్రస్తుతం నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) చందాదారులు 4.37 కోట్లకు చేరినట్లు బంధోపాధ్యాయ తెలిపారు. అందులో మెజారిటీ భాగం (2.90 కోట్ల మంది చందాదారులు) అటల్‌ పెన్షన్‌ యోజన పరిధిలోని వారని ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో చందాదారుల సంఖ్యను మరో కోటి మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పీఎ్‌ఫఆర్‌డీఏ చైర్మన్‌ చెప్పారు. కరోనా రెండో ఉధృతి ప్రభావ నేపథ్యంలోనూ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 1.60 లక్షల సబ్‌స్ర్కైబర్ల ను చేర్చుకున్నట్లు  ఆయన వెల్లడించారు. 


సెన్సెక్స్‌ 355 పాయింట్లు డౌన్‌ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాల్లో పయనించాయి. పలు దేశాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు శరవేగంగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో నష్టాల తీవ్రత మరింత పెరిగింది. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ సూచీల్లోనూ నష్టాలు కొనసాగాయి. మంగళవారం  బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 354.89 పాయింట్లు కోల్పోయి 52,198.51 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 120.30 పాయింట్ల నష్టంతో 15,632.10 వద్ద ముగిసింది.


అదానీకి నష్టాల మోత

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాల్ని చవిచూశాయి. కొన్ని లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. మంగళవారం బీఎ్‌సఈలో అదానీ ట్రాన్స్‌ మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌ 5 శాతం చొప్పున నష్టపోయాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 3.90 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.05 శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ 0.16 శాతం తగ్గాయి. అదానీ గ్రూప్‌ కంపెనీలపై సెబీ, డీఆర్‌ఐ దర్యాప్తు చేపడుతోందని లోక్‌సభకు ఆర్థిక శాఖ వెల్లడించడం ఇందుకు కారణమైంది. 


తత్వ చింతన్‌ ఇష్యూకు 180 రెట్ల బిడ్లు 

ప్రత్యేక రసాయనాల తయారీ సంస్థ తత్వ చింతన్‌ ఫార్మా కెమ్‌ ఐపీఓకు అపూర్వ స్పందన లభించింది. మంగళవారంతో ముగిసిన కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ సైజుతో పోలిస్తే 180.36 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఐపీఓలో భాగంగా కంపెనీ 32,61,882 షేర్లను అమ్మకానికి పెట్టగా.. 58,83,08,396 షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయి.

Updated Date - 2021-07-21T06:40:37+05:30 IST