May 7 2021 @ 23:04PM

సూదులు అంటే భయమే కానీ...

ఇంజెక్షన్లు, సూదులు అంటే భయమే అయినప్పటికీ... తాను కరోనా వేయించుకున్నానని పాయల్‌ రాజ్‌పుత్‌ వెల్లడించారు. బుధవారమే ఆమె తొలి డోసు కరోనా టీకా తీసుకున్నారు. ‘‘అవును... ఇంజెక్షన్లు, సూదులతో కూడిన మెడికల్‌ ప్రక్రియ అంటే నాకు విపరీతమైన భయం. ఈ భయాన్ని ఎలా అధిగమించాలో నాకు తెలియదు. అయినప్పటికీ... ఎలాగోలా వ్యాక్సిన్‌ తీసుకున్నా. ప్రతి ఒక్కరూ అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోండి’’ అని పాయల్‌ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక... స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చాయని, అందువల్ల అందరూ ముందుగానే ఆ రెండిటి విషయంలో సిద్ధంగా ఉండమని ఆమె తెలియజేశారు.