పేటీఎం నష్టం రూ.473 కోట్లు

ABN , First Publish Date - 2021-11-28T08:04:38+05:30 IST

పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ నష్టాలు మరింత పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ నష్టం రూ.473 కోట్లకు పెరిగింది.

పేటీఎం నష్టం రూ.473 కోట్లు

న్యూఢిల్లీ:  పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ నష్టాలు మరింత పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ నష్టం రూ.473 కోట్లకు పెరిగింది. చెల్లింపుల ప్రాసెసింగ్‌ చార్జీలు పెరగడం ఇందుకు కారణమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ.436.7 కోట్ల నష్టం నమోదైందని కంపెనీ తెలిపింది. ఈ జూలై-సెప్టెంబరు కాలానికి వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ మొత్తం ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 49.6 శాతం పెరిగి రూ.1.086.4 కోట్లకు చేరుకుంది. స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాక కంపెనీ ప్రకటించిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలివి. ఈ నెలలో ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించిన పేటీఎం.. 18వ తేదీన కంపెనీ షేర్లను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి రూ.492.4 కోట్లుగా నమోదైన పేటీఎం చెల్లింపుల ప్రాసెసింగ్‌ చార్జీలు.. ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 36 శాతం పెరిగి రూ.670 కోట్లకు చేరుకున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాల ఖర్చులు వార్షిక ప్రాతిపదికన 35 శాతం పెరిగి రూ.386.5 కోట్లకు.. సాఫ్ట్‌వేర్‌, క్లౌడ్‌, డేటా సెంటర్‌ నిర్వహణ వ్యయాలు 56.5 శాతం పెరిగి రూ.112.9 కోట్లుగా నమోదయ్యాయి. 

Updated Date - 2021-11-28T08:04:38+05:30 IST