గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పేటీఎం ఔట్‌, ఇన్‌

ABN , First Publish Date - 2020-09-19T05:48:03+05:30 IST

డిజిటల్‌ చెల్లింపుల సేవల సంస్థ పేటీఎంకు గూగుల్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. క్రీడా బెట్టింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం యాప్‌ను తమ ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్‌ శుక్రవారం ఉదయం ప్రకటించింది.

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పేటీఎం ఔట్‌, ఇన్‌

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సేవల సంస్థ పేటీఎంకు గూగుల్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. క్రీడా బెట్టింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం యాప్‌ను తమ ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్‌ శుక్రవారం ఉదయం ప్రకటించింది. దీంతో, డౌన్‌లోడ్‌ లేదా అప్‌డేట్‌ చేసుకోవడానికి ఈ యాప్‌ కొన్ని గంటలపాటు అందుబాటులో లేకుండా పోయింది.

ఈమధ్యనే లాంచ్‌ చేసిన గేమ్‌ ఆన్‌ అప్లికేషన్‌ నుంచి పేటీఎం క్యాష్‌బ్యాక్‌ ఫీచర్‌ను తొలిగించడంతో మళ్లీ సాయంత్రానికే సంస్థ యాప్‌ను ప్లేస్టోర్‌లో అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే అతిపెద్ద మొబైల్‌ వ్యాలెట్‌ యాప్‌ అయిన పేటీఎంకు 5 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. 

Updated Date - 2020-09-19T05:48:03+05:30 IST