పసుపు రైతుల గోడు పట్టదా?

ABN , First Publish Date - 2021-06-14T09:01:18+05:30 IST

‘‘వైసీపీ ప్రభుత్వం పసుపు రైతులను ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం. వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి క్వింటా రూ.8 వేలు చొప్పున కొనుగోలు చేయించాలి’’ అని పీసీసీ

పసుపు రైతుల గోడు పట్టదా?

మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి: తులసిరెడ్డి


వేంపల్లె, జూన్‌ 13: ‘‘వైసీపీ ప్రభుత్వం పసుపు రైతులను ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం. వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి క్వింటా రూ.8 వేలు చొప్పున కొనుగోలు చేయించాలి’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచే క్వింటా రూ.6,850 చొప్పున మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముడి పసుపు కొనుగోలు చేసిందన్నారు. ఈ ఏడాది జూన్‌ వచ్చినా మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగలేదన్నారు. దీంతో రైతులు క్వింటా రూ.5 వేల చొప్పున ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకొంటున్నారన్నారు. ఈసారి దిగుబడి రాక, ధర లేక పసుపు పండించిన రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారన్నారు. అలాగే 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుంచి విడగొట్టి హైస్కూల్‌ విద్యలో కలపాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన సరికాదన్నారు. 

Updated Date - 2021-06-14T09:01:18+05:30 IST