ఫారెస్ట్‌ ప్లాంటేషన్‌ను సందర్శించిన పీసీసీఎఫ్‌

ABN , First Publish Date - 2020-12-04T05:08:43+05:30 IST

మండలంలోని కొండాయిగూడెం సెక్షన్‌ సాంబాయిగూడెం బీట్‌ పరిధిలోని పది హెక్టార్లలో నాటిన మారుజాతి మొక్కల ప్లాంటేషన్‌ను గురువారం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారి లోకేష్‌ జైస్వాల్‌ సందర్శించారు.

ఫారెస్ట్‌ ప్లాంటేషన్‌ను సందర్శించిన పీసీసీఎఫ్‌
ప్లాంటేషన్‌ను పరిశీలిస్తున్న పీసీసీఎస్‌ లోకేష్‌ జైస్వాల్‌, భద్రాద్రి జిల్లా అటవీ అధికారులు

 మణుగూరుటౌన్‌, డిసెంబర్‌ 3: మండలంలోని కొండాయిగూడెం సెక్షన్‌ సాంబాయిగూడెం బీట్‌ పరిధిలోని పది హెక్టార్లలో నాటిన మారుజాతి మొక్కల ప్లాంటేషన్‌ను గురువారం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారి లోకేష్‌ జైస్వాల్‌ సందర్శించారు. పాంటేషన్‌లో ఇప్పటి వరకు చేపట్టిన పనులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పాంటేషన్‌ అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ, సహజ అడవుల అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పీసీసీఎఫ్‌ వెంట భద్రాద్రి కొత్తగూడెం సీసీఎఫ్‌ రాజారావు, డీఎఫ్‌వో రంజిత్‌కుమార్‌, మణుగూరు ఎఫ్‌డీవో వేణుబాబు, ఎఫ్‌ఆర్‌వో ప్రసాదరావు, ట్రైనీ ఎఫ్‌ఆర్‌వో దీపిక, సెక్షన్‌ ఆఫీసర్లు అరుణ, సలూజ, శ్రీను ఉన్నారు.

  అశ్వాపురం అటవీరేంజ్‌లో

అశ్వాపురం  అటవీరేంజ్‌ పరిధిలో  గురువారం  అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌  కన్జర్వేటర్‌ (కంపాపథకం) లోకేష్‌ జైస్వాల్‌  పర్యటించి  శాఖ  ఆధ్వర్యంలో  జరుగుతున్న  అభివృద్ధి పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా  రేంజ్‌ పరిధిలోని  చింతిర్యాల బీట్‌లో  సుమారు 40 హెక్టార్‌లలో  నాటిన మారుజాతి  మొక్క ల  ప్లాంటేషన్‌, సత్యనారాయణపురం బీట్‌లో 100 హెక్టార్‌లలో  వచ్చేఏడాది  మొక్కలు  నాటేందుకు  జరుగుచున్న  ముందస్తు పనులను  ఆయన పరిశీలించారు.

Updated Date - 2020-12-04T05:08:43+05:30 IST