భూ తగాదాల్లో జోక్యం చేసుకుంటే పీడీ యాక్టు

ABN , First Publish Date - 2020-09-20T09:04:50+05:30 IST

భూ తగాదాల్లో ఫిర్యాదిదారు, ప్రతివాది మినహా మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే పీడీ యాక్టు నమోదు చేస్తామని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ హెచ్చరించారు...

భూ తగాదాల్లో జోక్యం చేసుకుంటే పీడీ యాక్టు

పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలి

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌  జోయల్‌ డేవిస్‌


గజ్వేల్‌, సెప్టెంబరు 19: భూ తగాదాల్లో ఫిర్యాదిదారు, ప్రతివాది మినహా మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే పీడీ యాక్టు నమోదు చేస్తామని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై శనివారం గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఏసీపీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్టులో ట్రయల్‌లో ఉన్న సమయంలో సాక్షులను సాక్ష్యం చెప్పే విధంగా ప్రేరణ చేయాలన్నారు. గ్రేవ్‌ కేసుల్లో ట్రయల్‌ జరిగే సమయంలో ప్రతీరోజూ సీఐ మానిటర్‌ చేయాలని, మహిళలపై, 18 సంవత్సరాలలోపు పిల్లలపై అత్యాచారం కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రతీరోజూ డాటా ఎంట్రీ తనిఖీ చేసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల గురించి, రోడ్డు భద్రత గురించి వారం రోజుల్లో నివేదికను తయారు చేసి తన కార్యాలయానికి పంపించాలని సూచించారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని, దాబాల వద్ద వాహానాలను నిలుపకుండా చూడాలని, వాటి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పోలీ్‌సస్టేషన్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో 5ఎస్‌ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, సీఐలు ఆంజనేయులు, కోటేశ్వర్‌రావు, రవీందర్‌, ఎస్‌ఐలు వీరన్న, శ్రీశైలం, పరమేశ్వర్‌, సాయిరాం, చంద్రశేఖర్‌, విజయ్‌కుమార్‌, మహబూబ్‌, అశోక్‌, ములుగు ఏఎ్‌సఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-20T09:04:50+05:30 IST