Advertisement
Advertisement
Abn logo
Advertisement

నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు

భువనగిరి రూరల్‌, డిసెంబరు 3: నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేయిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ హెచ్చరించారు. భువనగిరిలోని వివిధ ఎరువులు, విత్తనాల దుకాణాలను   ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని రంగ కృష్ణ సీడ్స్‌ షాపులో పెసర్లు, మినుములు, సన్న వరి విత్తన సంచులను తనిఖీ చేశారు. అదే విధంగా స్టాక్‌, ధరల పట్టికలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత ్తకుండా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి ఎ వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులున్నారుAdvertisement
Advertisement