Abn logo
Oct 15 2021 @ 07:48AM

HYD : మహిళలను వేధిస్తున్న నేరస్థుడిపై పీడీయాక్ట్

హైదరాబాద్‌ సిటీ : మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్యబస్వరాజ్‌పై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పీడీయాక్ట్‌ను ప్రయోగించారు. మేడ్చల్‌ జిల్లా బృందావన్‌కాలనీలోని ఆనందవల్లి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వి. ఆదిత్యబస్వరాజ్‌(25) నిత్యం పోర్న్‌ సైట్లను వీక్షించేవాడు. అసభ్యకరమైన వీడియోలు తీసి పోర్న్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయడం, మార్ఫింగ్‌ ఫొటోలతో యువతులను వేధించడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు అత్యాచారయత్నానికి కూడా పాల్పడ్డాడు. దీంతో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. సైబర్‌క్రైం పోలీసులు ఇతడిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

TAGS: arrest

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...