Abn logo
Sep 17 2021 @ 22:23PM

ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ విజయరావు, ఆర్డీవో, తదితరులు

గూడూరు, సెప్టెంబరు 17: ప్రశాంత వాతావరణంలో కౌటింగ్‌ ప్రక్రియను నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ విజయరావు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్వీఆర్ట్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలోని బ్యాలెట్‌ బాక్స్‌లను, కౌటింగ్‌కు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లాలో 10  కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గూడూరు డివిజన్‌లో గూడూరు, వెంకటగిరి ప్రాంతాలలో కౌటింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు.  ఈ నెల 19న కౌటింగ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు.  ఏజెంట్లు కొవిడ్‌ నిబంధనలను పాటించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయసంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం సమీపంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పోలీస్‌ బ్యారెక్స్‌ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళీకృష్ణ, డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐలు నాగేశ్వరమ్మ, శ్రీనివాసులురెడ్డి, ఎంపీడీవో నాగమణి, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కోట, :  కోట పోలీస్‌ స్టేషన్‌ను  ఎస్పీ విజయరావు తనిఖీ చేశారు. నేరాల పట్టికను పరిశీలించారు.  సచివాలయమహిళా పోలీసులకు విధి నిర్వహణలో జాగ్రత్తలను వివరించారు.  అనంతరం  మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధిస్తున్నామన్నారు.  పోలీసు స్టేషన్‌కు సంబంధించిన స్థలాలను ఆక్రమిస్తే  కేసులు పెడుతామని హెచ్చరించారు.  పోలీస్‌ స్థలాల పరిరక్షణ బాధ్యతలను సంబంధిత సీఐలకు అప్పగించామన్నారు.  డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, వాకాడు సీఐ హరికృష్ణ,   వాకాడు సర్కిల్‌ ఎస్‌ఐలు పుల్లారావు, రఘునాథ్‌, శేఖర్‌బాబు, గోపీ,  ఆదిలక్ష్మి, పోలీస్‌ రిసెప్షన్‌ భవన నిర్మాత కొడవలూరు ధనంజయరెడి పాల్గొన్నారు.