రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం

ABN , First Publish Date - 2022-01-25T05:22:06+05:30 IST

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, వైఎ్‌స జగనమోహనరెడ్డి పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రి మురళీధరన తీవ్ర విమర్శలు చేశారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బీజేపీ నేత శ్రీకాంతరెడ్డిని సోమవారం ఆయన పరామర్శించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం
సెంట్రల్‌ జైలులో ఉన్న బీజేపీ నేత శ్రీకాంతరెడ్డిని పరామర్శించి వస్తున్న కేంద్ర మంత్రి మురళీధరన

కేంద్ర మంత్రి మురళీధరన

కడప(క్రైం), జనవరి 24: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, వైఎ్‌స జగనమోహనరెడ్డి పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రి మురళీధరన తీవ్ర విమర్శలు చేశారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బీజేపీ నేత శ్రీకాంతరెడ్డిని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక శక్తులకు జగనమోహనరెడ్డి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని వదిలేసి అలాంటి వాటిని అడ్డుకోబోయిన శ్రీకాంతరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. శ్రీకాంతరెడ్డిపై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం అసమర్థత వల్ల రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. పోలీసులు కూడా వైసీపీ నాయకుల కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపించారు. తమ శ్రేణులను ఆత్మకూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రానున్న కాలంలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ముందుగా కడప ఎయిర్‌పోర్టుకు వచ్చిన కేంద్ర మంత్రి మురళీధరనకు ఎంపీ సీఎం రమేశ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనాల్లో కడప కేంద్ర కారాగారానికి వచ్చారు. కేంద్ర మంత్రితో పాటు మరో కారును మాత్రమే సెంట్రల్‌ జైలులోకి అనుమతి ఇవ్వడంతో బీజేపీ నేతలు వెలుపలే వేచి ఉన్నారు. అనంతరం కేంద్రమంత్రి కర్నూలుకు బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2022-01-25T05:22:06+05:30 IST