Jun 14 2021 @ 14:31PM

`పీన‌ట్ డైమండ్` ట్రైలర్ విడుదల చేసిన క్రిష్‌

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై   అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న చిత్రం `పీన‌ట్ డైమండ్`. సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను డైరెక్ట‌ర్ క్రిష్ రిలీజ్ చేశారు. చెడు, మంచి అనేది త్రేతాయుగం, ద్వాప‌ర‌యుగంలో ఎలా ఉండేదో వివ‌రిస్తూ ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్‌లో క‌లియుగంలో మంచికి చోటు లేదు.. చెడుకి మాత్ర‌మే చోటుంది అనేలా ట్రైల‌ర్ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. దీంతో పాటు మ‌రో కోణంలో మీరో వ‌జ్రాలపై చేసే ప‌రిశోధ‌న‌ను కూడా చూపిస్తూ వ‌చ్చారు. ఇందులో సుమ‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ పాత్ర‌లు క‌నిపిస్తున్నాయి. ట్రైల‌ర్ విడుద‌ల చేసిన క్రిష్ మాట్లాడుతూ ‘‘పీన‌ట్ డైమండ్’ టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది.  రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను.. ట్రైలర్ చాలా బాగుంది.. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.