80శాతం రాయితీతో శనగ విత్తనాలు

ABN , First Publish Date - 2021-12-07T06:37:43+05:30 IST

అకాల వర్షాలకు రబీ సీజన్‌లో పంట నష్టపోయిన శనగ రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించే ప్రక్రియ ప్రారంభించినట్లు జేడీఏ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

80శాతం రాయితీతో శనగ విత్తనాలు

జేడీఏ శ్రీనివాసరావు

ఒంగోలు (జడ్పీ), డిసెంబరు 6 : అకాల వర్షాలకు రబీ సీజన్‌లో పంట నష్టపోయిన శనగ రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించే ప్రక్రియ ప్రారంభించినట్లు జేడీఏ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 5,744 క్వింటాళ్ల శనగ విత్తనాలను రాయితీపై రైతులకు అందిస్తామని వివరించారు. జేజీ రకం విత్తనాలు క్వింటా ధర రూ.6,900 ఉండగా రాయితీపోను రూ.1380 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాక్‌ రకం ధర రూ.8,780కి గాను రూ.1,756 చెల్లిస్తే విత్తనాలు అందిస్తామని చెప్పారు. ఎకరాకు 25 కిలోల చొప్పున గరిష్ఠంగా ఒక్కో రైతుకు మూడు ఎకరాల వరకు అందజేస్తామని తెలిపారు. విత్తనాలు కావాల్సిన వారు. సమీప ఆర్‌బీకేల్లో డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. రాయితీపోను ప్రభుత్వం తెలిపిన ధర కంటే ఎక్కడైనా అధికంగా వసూలు చేసినట్లయితే తన దృష్టికి తీసుకువస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు.  

Updated Date - 2021-12-07T06:37:43+05:30 IST