వేరుశనగకు చీడపీడల బెడద

ABN , First Publish Date - 2021-08-03T06:39:27+05:30 IST

ప్రస్తుత ఖరీఫ్‌ సీజనలో మండల వ్యాప్తం గా సాగైన వేరుశనగ పంటకు చీడపీడల బెడద అధికమైంది. తెరిపి లేని వర్షాలతో పైరుకు పచ్చపురుగు ఆశించింది.

వేరుశనగకు చీడపీడల బెడద
వేరుశనగను ఆశించిన పచ్చపురుగు.. మందు పిచికారీ చేస్తున్న రైతు

 తెరిపిలేని వర్షాలతో పైరును ఆశించిన పచ్చపురుగు


గుత్తి రూరల్‌, ఆగస్టు 2: ప్రస్తుత ఖరీఫ్‌ సీజనలో మండల వ్యాప్తం గా సాగైన వేరుశనగ పంటకు చీడపీడల బెడద అధికమైంది. తెరిపి లేని వర్షాలతో పైరుకు పచ్చపురుగు ఆశించింది. పంట తొలిదశలోనే తెగుళ్లు  పీడిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల రైతులు జూలైలో కురిసిన వర్షాలకు విత్తనం వేశారు. ప్రస్తుతం పైరు పూత దశ కు రాక మునుపే తెగుళ్లు సోకాయి. దీంతో దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనలో మండలవ్యాప్తంగా 17,789 హె క్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా, అందులో 13,347 హెక్టార్లలో వి త్తనం పడింది. పత్తి 1,447 హెక్టార్లలో సాగు చేశారు. బేతాపల్లి, కరిడికొం డ, వన్నేదొడ్డి, ఇసురాళ్లపల్లి, ఎంగిలిబండ, గాజులపల్లి, జక్కలచెరువు, గొం దిపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో వేరుశనగ సాగై 25 రోజులైంది. విత్త నం వేసినప్పటి నుంచి వర్షాలు కురుస్తుండటంతో పంట తెగుళ్లబారిన ప డుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


జీడ, పచ్చపురుగు ఆశించింది:

సంగాలప్ప, రైతు, వన్నేదొడ్డి

పది ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. ప్రస్తుతం 25 రోజుల పైరుకు పచ్చపురుగు, జీడ ఆశించింది. మందులు పిచ్చికారి చేశా. పైరు పూత దశకు చేరుకుంటోంది. తెగుళ్ల మూలంగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. పూతదశకు చేరకనే తెగుళ్ల సోకడం ఆందోళన కలిగిస్తోంది. 


రెండుసార్లు మందు పిచికారీ చేశా:

 యల్లయ్య, రైతు, వన్నేదొడ్డి

ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. పంటకు జీడ, పచ్చపురుగు ఆశించింది. ఇప్పటికే రెండుసార్లు మందు పిచికారీ చేశా. మార్కెట్‌లో మందులు కొనేందుకు అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం సబ్సిడీతో మందులు అందజేస్తే రైతుకు ప్రయోజకరంగా ఉంటుంది


వాతావరణ ప్రభావంతో తెగుళ్లు: ముస్తాక్‌ అహమ్మద్‌, ఏఓ, గుత్తి 

వాతావరణ ప్రభావంతో ప్రస్తుతం వేరుశనగకు పచ్చపురుగు, జీడ ఆశించాయి. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. తెగుళ్ల నివారణకు మోనోక్రోటోఫా్‌సను లీటరు నీటిలో 2.2 ఎంఎల్‌ కలిపి పిచికారీ చేయాలి. సలహాలు, సూచలన కోసం రైతులు ఫోన ద్వారా కూడా సంప్రదించవచ్చు.

Updated Date - 2021-08-03T06:39:27+05:30 IST