అభివృద్ధి పథంలో పెద్దపల్లి జిల్లా

ABN , First Publish Date - 2020-06-02T09:48:23+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తున్నది.

అభివృద్ధి పథంలో పెద్దపల్లి జిల్లా

రైతు మోములో ఆనందం

రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి

నేడు రాష్ట్ర ఆవతరణ దినోత్సవం


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తున్నది. సగం తెలంగాణ జిల్లాలకు సాగు నీటిని అందిం చే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడంతో జిల్లాలో గోదావరి జల కళను సంతరించుకున్నది. తెలంగాణ ఏర్పాటై ఆరు సంవ త్సరాలు గడుస్తున్న సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. 


గలగలా పారుతున్న కాళేశ్వరం నీళ్లు..

తెలంగాణలోని సగం జిల్లాల్లోని 18 లక్షల ఎకరాల ఆయకట్టు భూము లకు సాగు నీటిని అందించేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ఆరంభించి జాతికి అంకితం చేశారు. ఎస్సారెస్పీ నిండినా, నిండక పోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయనే భరోసా రైతులకు క లిగింది. మిడ్‌ మానేరు నీటిని తరలించే వరద కాలువ నుంచి కాకతీ య కాలువకు అనుసంధానం చేస్తూ చేపట్టిన 3 కిలోమీటర్ల కాలువ ప నులు సాగుతున్నాయి. ఈ కాలువ పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు నేరుగా నీళ్లు రానున్నాయి. 


మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ.. 

జిల్లాలో గల పలు చెరువులకు మిషన్‌ కాకతీయ పథకంతో జల కళ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద చెరువులు కలిసి 1,182 చెరువులు ఉండగా, వీటిలో 665 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. మూడు నియోజకవర్గాల్లో మూడు చెరువులను మినీ ట్యాంకు బండ్‌లు గా తీర్చి దిద్దేందుకు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. వర్షాల వల్లనే గాకుండా కాలువల ద్వారా కూడా చెరువులు నింపడానికి పనులు చేపట్టారు. దీంతో వేసవి వచ్చినా చెరువులు ఎండి పోవడం లేదు. 


మిషన్‌ భగీరథతో ఇంటింటికి తాగు నీరు.. 

ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మి షన్‌ భగీరథ పనులు పూర్తి కాగా, ప్రతి గ్రామానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. సుమారు 1,800 కోట్ల రూపాయలతో పెద్దపల్లి, రామగుం డం, మంథని అసెంబ్లీ నియోజవర్గాల్లోని గ్రామాలకు శ్రీపాద ఎల్లంప ల్లి ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇంట్రా విలేజ్‌ స్కీం ద్వారా కొత్తగా పైపులైన్లు తవ్వి ఇంటింటికి నల్లా కనెక్షన్లను ఇచ్చారు. దీంతో కొన్నిగ్రామాలకు తాగునీటి ఇక్కట్లు తప్పాయి. ప్రభుత్వ అత్యంత ప్రాధా న్యత ఇస్తున్న ఆసరా పింఛన్ల పథకం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీ ఆర్‌ కిట్‌ పథకాలు ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతున్నాయి. 


నెరవేరని సొంతింటి కల..

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం జిల్లాకు 3 వేలకు పైగా డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లను మంజూరు చేస్తే వాటిని పూర్తి చేసి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇవ్వలేదు. ఐదేళ్లుగా ఈ పథకం అపసోపాలు పడుతున్నది. పెద్దపల్లి, మంథని, ఓదెల, అంతర్గాం, కాల్వశ్రీరాంపూర్‌. తదితర మండలాల్లో డబుల్‌ బెడ్‌ రూంల ఇళ్లు నిర్మాణంలో కొనసాగుతు న్నాయి. కేవలం 539 ఇళ్లు మాత్రమే పూర్తి దశకు చేరుకున్నాయి. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ ముందుకు సాగడం లేదు. నామమాత్రంగా ధర్మారం, కాల్వశ్రీరాంపూర్‌, మంథని ప్రాంతంలోని కొందరికి మాత్రమే భూములను కొనిచ్చిన ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవడం లేదు. 


కలగా మారిన రామగుండం మెడికల్‌ కళాశాల..

జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో మెడికల్‌ కళాశా లతో పాటు మైనింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి ఐదేళ్లయినా దాని ఊసెత్తడం లేదు. ఇప్పటికైనా మెడికల్‌, మైనింగ్‌ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసు లు కోరుతున్నారు. 


Updated Date - 2020-06-02T09:48:23+05:30 IST