Oct 23 2021 @ 17:31PM

Peddanna: ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘అణ్ణాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘పెద్దన్న’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేయనున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్‌లలో సందడి చేయనుంది. శనివారం హీరో వెంకటేశ్‌ ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేపి రజనీ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నట్లు టీజర్‌ చూేస్త తెలుస్తోంది.  ‘‘పల్లెటూరు వాడిని శాంతంగానే చూసుంటావ్‌.. కోప్పడి చూడలేదు కదా!  ‘ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’ అంటూ రజనీకాంత్‌ చెప్పే డైలాగ్‌ అలరిస్తోంది. దాని వెనుక నేపథ్య సంగీతం కేడా అలరిస్తోంది.  సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి డి.ఇమ్మాన్‌ సంగీతం అందించారు.