Peddapalli: ఎస్సారెస్పీ కెనాలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి

ABN , First Publish Date - 2021-07-31T17:55:16+05:30 IST

జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్ లోకి ట్రాక్టర్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రేగడిమద్దికుంట గ్రామ ...

Peddapalli: ఎస్సారెస్పీ కెనాలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్ లోకి ట్రాక్టర్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రేగడిమద్దికుంట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు ఈతగాళ్ల సహాయంతో బయటికి తీశారు. మృతుడు ఎర్రంశెట్టి శ్రీనివాస్‎గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-31T17:55:16+05:30 IST