Abn logo
Sep 28 2021 @ 09:40AM

Peddapalli జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం

పెద్దపల్లి: జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండిపోయాయి. పెద్దపల్లి,  కొత్తపల్లి రహదారిపై నీరు ప్రవహిస్తోంది. ఓదెలా మండల కేంద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద  వర్షం నీరు చేరింది. దీంతో ఓదెలా, కొమిరె గ్రామాలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మానేరు డ్యామ్  గేట్లు ఎత్తడంతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పక్కనున్న పొలాల్లో  నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మానేరు వద్దకు ఎవరు వెళ్లకూడదంటూ జిల్లా అధికారులు పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption