Abn logo
Feb 23 2021 @ 07:52AM

పెద్దపల్లిలో ఘోరం : కిలో బంగారంతో వెళ్తున్న వ్యాపారుల మృతి

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్  మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు బంగారు వ్యాపారులుగా గుర్తించారు. సంఘటన స్థలంలో కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


మృతి చెందిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబులుగా.. గాయపడిన వారిని సంతోష్ కుమార్, సంతోష్‌లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కాగా వీళ్లంతా బంగారం అమ్మడానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులు ప్రస్తుతం గోదావరిఖనిలో చికిత్స పొందుతున్నారు. 108 సిబ్బంది కారులో బంగారు ఆభరణాలను గుర్తించి రామగుండం ఎస్‌ఐ శైలజకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement