Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజలను దోచుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం, డిసెంబరు 7: వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. మండల పరిధిలోని దివిలిలో టీడీపీ మండలాధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గౌరవసభలో రాజప్ప పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్పితే గత రెండేళ్లుగా వైసీపీ చేసింది ఏమీలేదన్నారు. ఓటీఎస్‌ పేరుతో ప్రజల నుంచి వేలాది రూపాయలు బలవంతపు వసూళ్లకు పాల్పడడం దుర్మార్గమన్నారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చేసి సత్తాచాటాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజాసూరిబాబురాజు, అన్నవరం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా మాజీ డైరెక్టర్‌ ఎలిశెట్టి నాని, తెలుగు రైతు నాయకుడు పాలకుర్తి శ్రీనుబాబు, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు, చాగంటి గోపాలకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement