‘సౌకర్యాలు మెరుగుపర్చాలి’

ABN , First Publish Date - 2022-01-29T05:42:45+05:30 IST

తుని, జనవరి 28: తుని ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందించే సౌకర్యాలు మెరుగుపర్చాలని డివిజన్‌ కమిటీ సమావేశంలో పెద్దాపురం ఆర్టీవో పి.వెంకటరమణ ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్‌ ప్లాంటును శుక్రవారం ప్రారంభించిన అనంతరం డివిజన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్టీవో మాట్లాడుతూ కొవిడ్‌ను సమర్థవంతం గా ఎదుర్కొనేందుకు రూ.1.30కోట్లతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏ

‘సౌకర్యాలు మెరుగుపర్చాలి’

తుని, జనవరి 28: తుని ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందించే సౌకర్యాలు మెరుగుపర్చాలని డివిజన్‌ కమిటీ సమావేశంలో పెద్దాపురం ఆర్టీవో పి.వెంకటరమణ ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్‌ ప్లాంటును శుక్రవారం ప్రారంభించిన అనంతరం డివిజన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్టీవో మాట్లాడుతూ కొవిడ్‌ను సమర్థవంతం గా ఎదుర్కొనేందుకు రూ.1.30కోట్లతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారన్నారు. 100 బెడ్లకు సరిపడ ఆక్సిజన్‌ అందించేందుకు సిద్ధం చేశారన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు భోజనాలు అందిస్తున్న కాంట్రాక్టర్‌కు బిల్లులు పెండింగ్‌ ఉండడంతో భోజనాలు నిలిపివేశారని, దీనికోసం మరొక కాంట్రాక్టర్‌ను వెంటనే చేయాలన్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉం దన్నారు. పాడైపోయిన అంబులెన్స్‌ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో బైక్‌స్టాండ్‌ ఏర్పాటు, పాత సామాన్లు అ మ్మకానికి కమిటీ తీర్మానించింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఏలూరి సుధారాణి, ఎంపీపీ బొప్పన రాము, తహశీల్దార్‌ శ్రీపల్లవి, కమిషనర్‌ ప్రసాదరాజు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, ఏలూరి బాలు, పోతల రమణ, పోతుల లక్ష్మణ్‌, షేక్‌ ఖ్వాజా, పామర్తి మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:42:45+05:30 IST