హైదరాబాద్: రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లు

ABN , First Publish Date - 2021-01-14T05:30:00+05:30 IST

అక్రమ కట్టడాలకు ఆ ప్రాంతం అడ్డాగా మారింది. ప్రజా ప్రతినిధుల అండతో కబ్జా రాయళ్లు రెచ్చిపోతున్నారు.

హైదరాబాద్: రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లు

హైదరాబాద్: అక్రమ కట్టడాలకు ఆ ప్రాంతం అడ్డాగా మారింది. ప్రజా ప్రతినిధుల అండతో కబ్జా రాయళ్లు రెచ్చిపోతున్నారు. అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అక్రమ కట్టడాలకు కేరాఫ్‌గా మారిన ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడనుకుంటున్నారా? మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ ఇళ్ల నిర్మాణాలకు కేంద్రంగా మారింది. టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఇళ్ల నిర్మాణాల్లో నిబద్దతలకు పాతరేస్తున్నారు. అయినా పట్టించుకునేవాళ్లు లేరని స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా పీర్జాదిగూడ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 26 డివిజన్లు ఉన్నాయి. లక్ష మందికిపైగా జనాభా ఉంది. ఎటువంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. స్థానిక కార్పొరేషన్లకు ఎంతో కొంత ముట్టజెప్పి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - 2021-01-14T05:30:00+05:30 IST