Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ కార్యకర్తల్లా పోలీసుల వ్యవహారం: పీతల సుజాత

జంగారెడ్డిగూడెం: పోలీసుల తీరుపై టీడీపీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలంలో టీడీపీ నేత, దళితుడు పల్లి శ్రీనుని పోలీసులు రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకువెళ్లడం  అమానుషమన్నారు. పోలీసులు బాధ్యతలు మరిచిపోయి వైసీపీ కార్యకర్తల్లా వ్యవరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం అత్యంత పాశావికమన్నారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, పల్లి శ్రీనుకి అండగా ఉంటామని పీతల సుజాత స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement