సింధు సాధన షురూ

ABN , First Publish Date - 2020-08-06T09:30:00+05:30 IST

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సుదీర్ఘ విరామం తర్వాత సాధన మొదలుపెట్టింది. అన్‌లాక్‌డౌన్‌-3లో భాగంగా బుధవారం నుంచి ...

సింధు సాధన షురూ

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సుదీర్ఘ విరామం తర్వాత సాధన మొదలుపెట్టింది. అన్‌లాక్‌డౌన్‌-3లో భాగంగా బుధవారం నుంచి జిమ్‌లకు అనుమతి లభించడంతో హైదరాబాద్‌లోని సుచిత్ర అకాడమీలో సింధు కసరత్తులు చేసింది. ట్రైనర్‌ సమక్షంలో దాదాపు మూడు గంటలకు పైగా జిమ్‌లో చెమటోడ్చినట్టు సింధు తెలిపింది. ఈ సందర్భంగా వర్కవుట్‌ చేస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Updated Date - 2020-08-06T09:30:00+05:30 IST