Sep 21 2021 @ 18:44PM

దసరాకు సందD షురూ

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సంద’. రోషన్‌, శ్రీలీలా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్‌ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్‌ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి,  శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్‌ పూర్తి చేసుకుని యు సర్టిఫికెట్‌ పొందింది. చక్కని ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.