పెళ్లి సందడిపై కేసు..!

ABN , First Publish Date - 2021-05-07T06:10:59+05:30 IST

కరోనా ఒకపక్క కోరలు చాస్తోంది. కరోనా కట్టడికి మరోపక్క కర్ఫ్యూ అమలులో ఉంది.

పెళ్లి సందడిపై కేసు..!

వేడుకలో డీజే, రికార్డింగ్‌ డ్యాన్స్‌లు   

పాటించని కొవిడ్‌ నిబంధనలు 

గిద్దలూరు టౌన్‌, మే6 : కరోనా ఒకపక్క కోరలు చాస్తోంది. కరోనా కట్టడికి మరోపక్క కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ క్రమంలో కొవిడ్‌ నిబంధనలు సైతం లెక్కచేయ కుండా ఓ గ్రామంలో పెళ్లి సందడి ప్రజలను ఆందోలనకు గురిచేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వేడుకపై కేసు నమోదు చేశారు. మండలం జయ రాంపురంలో గురువారం జరగాల్సిన వివాహానికి బుధవారం రాత్రి ఓ ఇంటి వద్ద జరిగిన వివాహానికి పెద్ద ఎత్తున బంధుగణం తరలి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డీజే, రికార్డుంగ్‌ డ్యాన్స్‌లతో హోరెత్తించారు.  బుధవారం రాత్రి గ్రామంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెకు ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో గ్రామానికి చెం దిన బంధువులతోపాటు ఇతర బంధువర్గం హాజరయ్యారు. కేవలం వివాహంలో ఇరుపక్షాల నుంచి 40 మంది మాత్రమే హాజరు కావాలని, అందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తహసీల్దార్‌కు అందించి అనుమతి తీసుకోవలసి ఉంది. అయితే నిబంధనలు పక్కన పెట్టి భారీగా జనసమీకరణ చేసి మాస్కులు, భౌతికదూరం లేకుండా మహిళలతో రికార్డింగ్‌ డ్యాన్స్‌, డీజే నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌  మీడియాలో సైతం వైరల్‌ అ య్యాయి. నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి వేడుకను నిర్వహించిన వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ యూ సుధాకర్‌రావు తెలిపారు. అనుమతి లేకుండా వివా హాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2021-05-07T06:10:59+05:30 IST