మాస్కులు ధరించకుంటే జరిమానా: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-08-09T09:00:28+05:30 IST

కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు లేకుండా తిరిగితే ఎవరినీ ఉపేక్షించవద్దని.. జరిమానాలు విధించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు...

మాస్కులు ధరించకుంటే జరిమానా: ఎర్రబెల్లి

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు లేకుండా తిరిగితే ఎవరినీ ఉపేక్షించవద్దని.. జరిమానాలు విధించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శనివారం పాలకుర్తికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయా అంశాలపై చర్చించిన మంత్రి.. సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. క రోనా నియంత్రణకు ఏ ఊరికి ఊరు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగ స్వాములు కావాలని సూచించారు. గ్రామ, మండల స్థాయి కమిటీలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఒక్కరికి పాజిటివ్‌ వచ్చినా కుటుంబమంతా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాలకుర్తికి త్వరలోనే రెండు అంబులెన్స్‌లు, 4 లక్షల మాస్కులను పంపనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-08-09T09:00:28+05:30 IST