పెండింగ్‌ పనులకు మోక్షం

ABN , First Publish Date - 2020-05-23T10:33:56+05:30 IST

జిల్లాలో మొన్నటివరకు కరోనా కట్టడిపై దృష్టి పెట్టి న యంత్రాంగం ప్రస్తుతం వ్యవసాయం, అభివృద్ధి ప నులపై కేంద్రీకరిస్తోంది.

పెండింగ్‌ పనులకు మోక్షం

కరోనా కట్టడి అనంతరం జిల్లాలో అభివృద్ధి పనులపై యంత్రాంగం దృష్టి


నిజామాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మొన్నటివరకు కరోనా కట్టడిపై దృష్టి పెట్టి న యంత్రాంగం ప్రస్తుతం వ్యవసాయం, అభివృద్ధి ప నులపై కేంద్రీకరిస్తోంది. పనులను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వానాకాలం సీజన్‌కు ఏర్పా ట్లు చేస్తోంది. పెండింగ్‌ పనుల పూర్తికి కార్యాచరణ రూపొందిస్తోంది. రెండు నెలల పాటు నిలిచిపోయిన పనులను వేగవంతం చేసేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ సమీక్షిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ధాన్యం సేకరణ పూర్తిచేయడంతో వానాకాలం సాగుకు సమాయత్తం చేస్తున్నారు.


వానాకాలం సీజన్‌ పనులు పది రోజుల్లో మొదలుకానున్నాయి. ఇప్పటికే రైతులు విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. భూములను చదును చేస్తున్నారు. తొలకరి పలకరించగానే పం టలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని చెరువులు, బోర్లలో నీళ్లు ఉండడంతో ఇప్పటికే బోధన్‌ డివిజన్‌లో రైతులు నారు పోశారు. జూన్‌ మొదటి వారం నుంచే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌లోని పలు మండలాల్లో పసుపుతో పాటు మొక్కజొన్న వేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. సోయా పంటను సాగుచేసేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పంటల విధానం ద్వా రా అన్ని రకాల పంటలను వేసేందుకు రైతులను సిద్ధం చేస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో రైతు సదస్సులను ని ర్వహించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంటలు వేసేవిధంగా ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. వ్యవసాయ శాఖ తరఫున క్లస్టర్‌ల వారీగా పంటల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కలెక్టర్‌ ఇప్పటికే పలు దఫాలు అధికారులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలను ఇచ్చారు. 


భూప్రక్షాళనపై రెవెన్యూ శాఖ దృష్టి..

జిల్లాలో రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటి వరకు  కరోనా కట్టడిపైన పనులు చేయగా.. ప్రస్తుతం పెండిం గ్‌ పనులపై దృష్టి సారించారు. భూప్రక్షాళనలో మిగిలి ఉన్న పనులపైన దృష్టి పెట్టారు. రైతులకు పట్టాలందిం చేందుకు చర్యలు చేపట్టారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్‌లను కూడా అందిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఉపాధి హామీ పనులను దృష్టిపెట్టారు. కరోనా సమయంలో గ్రామాల్లో కూలీలకు ప నులు కల్పిస్తున్నారు. పెండింగ్‌ పనులను పూర్తిచేస్తున్నారు. ఈజీఎస్‌ కింద చేపట్టిన భవనాలు, వైకుంఠధామాల పనులను పూర్తిచేస్తున్నారు. రోడ్డు పనులను చే పడుతున్నారు. సాగునీటి శాఖ ద్వారా పెండింగ్‌లో ఉ న్న ప్రాజెక్టుల పనులను పూర్తిచేస్తున్నారు. వానాకాలం దగ్గరకు వస్తుండడంతో నిర్ణీత సమయంలో పనులను పూర్తయ్యే విధంగా చూస్తున్నారు. కాళేశ్వరం ప్యాకేజీ ప నులను కూడా పూర్తిచేస్తున్నారు. వానాకాలం పంటల కు నీళ్లందించాలని సీఎం ఆదేశించడంతో పనులను వేగవంతం చేశారు. ఇతర కాల్వ నిర్మాణ పనులను కూడా చేస్తున్నారు. 


పెండింగ్‌ పనులు చేపట్టిన ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ శాఖలు

జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల తరఫు న చేపట్టిన రోడ్ల పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా పెండింగ్‌ పనులను పూ ర్తిచేయాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు సమీక్షిస్తున్నారు. జిల్లాలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు కూ డా పనులపైన దృష్టిపెట్టారు. జనరల్‌ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రుల్లో సాధారణ సేవలను అంది స్తున్నారు. జిల్లాలోని ఇతర శాఖల అధికారులు కూడా పెండింగ్‌ పనులపైన దృష్టి పెట్టారు. విద్యాశాఖ తరఫు న అకాడమిక్‌ క్యాలెండర్‌ రాకున్నా పదో తరగతి పరీక్ష లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించడంతో  ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలల పరిధిలో పెండింగ్‌ పనులను పూర్తిచేస్తున్నారు. అటవీ శాఖ తరఫున హరితాహారంతో పాటు ఇతర ప నులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ప్రభుత్వం ఆదేశించగానే పెండింగ్‌లో ఉన్న పింఛన్‌లను మంజూ రు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు పెం డింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డులను సిద్ధం చేస్తున్నారు. ప్ర భుత్వ అనుమతి రాగానే మంజూరు చేసే విధంగా ము ందస్తు పనులను చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ఎక్సైజ్‌, రవాణా, స్టాంపులు రిజిస్ట్రేషన్‌లు, వాణిజ్య పన్నులు, మున్సిపల్‌ శాఖల అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు.


పన్నుల వసూళ్లను వేగవంతం చేశారు గడిచిన వారం రోజులుగా అన్ని శాఖల కార్యాలయాల కు పూర్తిస్థాయి సిబ్బంది హాజరవుతుండడంతో వీటిపై న దృష్టిపెట్టారు. రెండు నెలలుగా కోవిడ్‌ పనులు చేసి న తాము ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాలు, కలెక్టర్‌ ఉత్త ర్వులతో  అభివృద్ధి పనులపైన దృష్టిపెట్టామని ఆయా శాఖల అధికారులు తెలిపారు. పెండింగ్‌ పనులన్ని పూ ర్తిచేస్తున్నామని వారు తెలిపారు. మొత్తంగా అన్ని శాఖ లు ప్రస్తుతం అభివృద్ధి పనులపైన దృష్టిపెట్టడంతో ప్రజల పనులు పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడింది.

Updated Date - 2020-05-23T10:33:56+05:30 IST