పెన్నమ్మ ఉగ్రరూపం

ABN , First Publish Date - 2020-11-28T09:36:19+05:30 IST

నెల్లూరు జిల్లాలో పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎన్నడూ లేనంతగా సోమశిల జలాశయానికి వరద వచ్చి చేరుతోంది. కడప, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలకు నది నిండుగా ప్రవహిస్తోంది.

పెన్నమ్మ ఉగ్రరూపం

   నెల్లూరు జిల్లాలో పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎన్నడూ లేనంతగా సోమశిల జలాశయానికి వరద వచ్చి చేరుతోంది. కడప, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలకు నది నిండుగా ప్రవహిస్తోంది. బీరాపేరు, బొగ్గేరు వాగులతో పాటు చిన్న వాగులు కూడా ఉధృతంగా ఉండటంతో పెన్నాలో ప్రవాహం మరింత పెరిగింది. శుక్రవారం 4.5లక్షల క్యూసెక్కుల వరద నదిలో ప్రవహించింది. కడప జిల్లాలోని పింఛా ప్రాజెక్టు నుంచి 2లక్షల క్యూసెక్కులకుపైగా అన్నమయ్య ప్రాజెక్టుకు విడుదలవడంతో ఆ నీటిని పెన్నా దిగువకు వదిలేస్తున్నారు.  తీరప్రాంత మండలాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. జలాశయం పది గేట్లు ఎత్తి 3.6లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదలడంతో పవర్‌ టెన్నల్‌, ఎడమవైపు రక్షణ గోడ సమీపంలోని రివీట్‌మెంట్‌ పూర్తిగా కోతకు గురైంది. క్యాంపు కాలనీలోకి వరద  చేరడంతో పంపుహౌస్‌ గదులు రెండు కొట్టుకుపోయాయి. పీకేపాడు వద్ద వరదలో చిక్కుకున్న ఇద్దరు యువకులను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. నెల్లూరు పెన్నా బ్యారేజీ ఉత్తరం వైపు పొర్లుకట్ట కోతకు గురైంది. రంగనాథస్వామి ఆలయంలోకి కూడా నీరు ప్రవేశించింది. 

Updated Date - 2020-11-28T09:36:19+05:30 IST