బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల బారులు

ABN , First Publish Date - 2020-04-05T11:30:40+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఖాతాదారులు భౌతికదూరం పాటించేందుకు బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందిస్తునే వైరస్‌

బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల బారులు

ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు


ఆదిలాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 4: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఖాతాదారులు భౌతికదూరం పాటించేందుకు బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందిస్తునే వైరస్‌ వ్యాప్తి నిరోధానికి హ్యాండ్‌వాష్‌ వంటి చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఆవరణలో ముగ్గుతో సర్కిల్‌ వేసి అందులో ఖాతాదారులను ఉంచి ఒకరి అనంతరం ఒకరిని నగదు తీసుకునే విధంగా ఏర్పా టు చేశారు. ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ శ్రీధర్‌బాబు, చీఫ్‌ మేనేజర్‌ ప్రసాద్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


ముఖ్యంగా వృద్ధులకు ప్రత్యేకంగా బ్యాంక్‌ లావాదేవీలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఈనెల మొదటివారం కావడంతో పె న్షనర్లు, ఉద్యోగులు తమ డబ్బులను డ్రా చేసుకునేందుకు పెద్దఎత్తున బ్యాంకుల వద్ద బారులు తీరారు. అయితే కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఎవరినీ లోనికి అనుమతించకుండా బ్యాంకు కిటికీల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో  ఆయా బ్యాంకుల వద్ద డబ్బుల కోసం వచ్చిన వారిని బయట ఉంచే వారి సేవలు పూర్తి చేస్తున్నారు.

Updated Date - 2020-04-05T11:30:40+05:30 IST