హిజ్రాల పేరుతో పింఛన్లు దోచుకున్నారు

ABN , First Publish Date - 2021-09-14T22:33:53+05:30 IST

జిల్లా అభివృద్ధి మానిటరింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా

హిజ్రాల పేరుతో పింఛన్లు దోచుకున్నారు

గుంటూరు: జిల్లా అభివృద్ధి మానిటరింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. హిజ్రాల పేరుతో పింఛన్లను కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగులు దోచుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే సమావేశంలో తెలిపారు. గత ఐదేళ్లుగా తమ పింఛన్లను కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగులు దోచుకుంటున్నారనే విషయాన్ని తన దృష్టికి హిజ్రాలు తెచ్చారని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. హిజ్రాల పింఛన్లు పెద్ద స్కాం అని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్ చేసారు. 


జిల్లాలో ఎన్ని పింఛన్లు తొలగించారో చెప్పాలని డీఆర్డీఏ పీడీని ఎంపీ గల్లా జయదేవ్ అడిగారు. తమ దగ్గర సమాచారం లేదని ఎంపీకి డీఆర్డీఏ పీడీ సమాధానం ఇచ్చారు. గ్రామ సచివాలయాల వద్ద సమాచారం ఉంటుందని పీడీ తెలిపారు. దీంతో ఎంపీ గల్లా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. 34 వేలకు పైగా  పింఛన్లు ఆగిపోయానని జేసీ తెలిపారు. సమావేశానికి ఎంపీలు గల్లా జయదేవ్, లావు శ్రీ కృష్ణ దేవరాయులు, అయోధ్య రామిరెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు.  

Updated Date - 2021-09-14T22:33:53+05:30 IST